Site icon Prime9

Suryalanka Beach: దసరా సెలవులు మిగిల్చిన విషాదం.. బీచ్ లో ఏడుగురు విద్యార్థులు గల్లంతు

3 student dead and two students missing in suryalanka beach

3 student dead and two students missing in suryalanka beach

Suryalanka Beach: దసరా సెలవులు ఆ ఇళ్లల్లో విషాదాన్ని నింపాయి. విహారయాత్రకని వెళ్లిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఏపీలోని బాపట్ల సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది.

దసరా సెలవులను జాలీగా గడుపుదామని భావించిన విజయవాడకు చెందిన కొందరు విద్యార్థులు సరదాగా బాపట్లలోని సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. ఈతకొడదామని అందరూ కలిసి నీటిలో దిగారు. కాగా భారీ అలలు ఒక్కసారిగా రావడంతో అలల ఉద్ధృతికి వారంతా సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఆ ఏడుగురు విద్యార్థులు కూడా ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతయ్యారు. అయితే సముద్రంలోకి దిగిన ఏడుగురి విద్యార్థుల్లో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరిని, స్థానికులు గజ ఈతగాళ్ల సహాయంతో కాపాడారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల వెంటనే రంగంలోకి దిగి మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా పోలీసులు గుర్తించారు. ఫణి, రాఘవ, ప్రభు దాసు ఆచుకీ ఇంకా లభ్యం కాలేదన్నారు. వారంతా ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు చదువుతున్న పిల్లలని వివరించారు. దసరా సెలవులు కావడంతో వల్ల తామంతా బాపట్లలోని సూర్యలంక బీచ్కు వచ్చామని క్షేమంగా బయటకు వచ్చిన బాలుడు తెలిపాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదం అలుముకుంది.

ఇదీ చదవండి: వైద్యుల నిర్లక్ష్యం.. శిశువు బొడ్డుతాడుకు బదులుగా చిటికెన వేలు కత్తిరించిన వైనం

Exit mobile version