Site icon Prime9

Crime News: నీటి కుంటలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

yacharam crime news 4 children dead

yacharam crime news 4 children dead

Crime News: ఆడుతూపాడుతూ అప్పటివరకూ కళ్లముందే తిరుగుతున్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారారు. సరదాగా చేపలు పట్టడానికి వెళ్లి నీటికుంటలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని సోలిపూర్ గ్రామానికి చెందిన అక్షిత్‌ గౌడ్‌, ఫరీద్‌, పర్వీన్‌లు సరదాగా చేపలు పట్టడానికి సమీపంలోని నీటిగుంటలోకి దిగారు. కాగా అది లోతు ఎక్కువగా ఉందన్న విషయం గుర్తెరుగని ఆ ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో మునిగి చనిపోయారు. అది గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను వెంటనే బయటకు తీశారు. కాగా వారంతా పదేళ్ల వయస్సులోపు వారేనని స్థానిక ప్రజలు తెలిపారు. అప్పటివరకు కళ్లముందున్న చిన్నారులు విగజీవులుగా మారడంతో వారి తల్లదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: లోయలో పడిన టెంపో.. 7 మంది మృతి

Exit mobile version