Three Flores Building Drooping: ఏ భూకంపం వస్తేనే లేదా నేల కుంగితేనో సడెన్ గా భవనాలు కూలిపోతాయి. అయితే మరి వైయస్‌ఆర్ జిల్లాలో మాత్రం అకస్మాత్తుగా అర్థరాత్రి వేళ ఓ భవనం కుంగిపోయింది. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. మరి ఈ ప్రమాదం ఎందుకు ఎలా జరిగిందో ఓసారి చూసేద్దాం..
కడప నగరం కో-ఆపరేటివ్ కాలనీలోని విద్యామందిర్ పాఠశాల సమీపంలో ఓ మూడంతస్తుల భవనం ఉంది. అయితే అది బుధవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కుంగిపోయింది. ప్రాణ నష్టం ఏమీ జరుగకపోవడంతో అక్కడి స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా అక్కడి ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ భవనం పాతది కావడం వల్ల ఇంటి యజయాని వెంకటరామరాజు.. గ్రౌండ్‌ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న వారిని ఇటీవల ఖాళీ చేయించి మరమ్మతులు చేయిస్తున్నారు.
కాగా మొదటి అంతస్తులో సుబ్బరాయుడు తన భార్య మరియు ముగ్గురు పిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్నారు. రెండో అంతస్తులో సుదర్శన్‌రాజు, మౌనిక దంపతులు వారిద్దరి పిల్లలతో కలిసి రెంటుకు ఉంటున్నారు.
కాగా బుధవారం అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అకస్మాత్తుగా భారీ శబ్దాలు వినిపించాయి. దానితో సెకండ్ ఫ్లోర్లో ఉన్న వారు బయటికి వచ్చి చూశారు. అప్పటికే భవనం కొంతమేరకు కుంగిపోవడం గమనించి భయంతో కుటుంబం మొత్తం బయటికి వచ్చేశారు. ఇంక మొదటి అంతస్తులో ఉన్నవారు తలుపులు తెరుచుకోకపోవడంతో లోపలే ఉండిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కిటికీల ఊచలు తొలగించి వారిని కాపాడారు. మరమ్మతుల కోసం డ్రిల్లింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు పోలీసులతో తెలుపుతున్నారు.
ఇదీ చదవండి: Another Injection Murder In Khammam: మరో సూది మందు హత్య… రెండో భార్యని వదిలించుకోవడానికే ప్లాన్..!