Site icon Prime9

Khammam Injection Murder: ఇంజెక్షన్ హత్య… సూత్రధారి భార్యే… పథకం ప్రకారమే..!

Khammam Injection Murder

Khammam Injection Murder

Khammam Injection Murder: ఖమ్మం జిల్లాలో ఇటీవలె లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తినే ఇంజెక్షన్ ఇచ్చి చంపిన ఘటన విధితమే. కాగా ఆ హత్యపై పోలీసులు దర్యాప్తు చెయ్యగా వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని వెల్లడయ్యింది. సొంత భార్యే అతన్ని హత్య చేయించిందని తేలింది.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఇమామ్‌బీ, అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ మోహన్‌రావుకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా అప్పటికే ఇమామ్ బీకి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇమామ్ బీ మోహన్ రావు ఇద్దరు కలిసి ఉన్న సమయంలో జమాల్‌సాహెబ్‌ చూశాడు.
అప్పటి నుంచి వారిరువురి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. నిత్యం గొడవులు జరిగేవి. ఈ క్రమంలో తన భర్తను చంపేయాలని ఇమామ్‌బీ ప్రియుడు మోహన్‌రావుకు చెప్పింది. మోహన్‌ రావు బండి వెంకన్న అనే ఆర్‌ఎంపీ వైద్యుడి సహాయంతో రెండు బాటిళ్ల మత్తుమందు తెప్పించి.. మత్తుమందు సహాయంతో తన భర్తను చంపేయమని ఒక బాటిల్ను ఇమామ్బికి ఇచ్చాడు. అయితే ఆ మత్తుమందుతో భర్తను చంపడానికి రెండు నెలలుగా ప్రయత్నిస్తూ ఆమె విఫలం అయ్యింది. దీనితో ఇమామ్బి వల్లకాదని మోహన్ రావు రంగంలోకి దిగాడు. ఈ క్రమంలోనే ఈనెల 19న పథకం ప్రకారం ఇమామ్‌బీ జగ్గయ్యపేటలోని తన కూతురు దగ్గరికి వెళ్లింది. జమాల్‌ కూడా జగ్గయ్య పేట వస్తున్నాడని మోహన్‌కు చెప్పింది.

దానితో మోహన్‌ తన మిత్రుడైన వెంకటేశ్‌, ఆర్‌ఎంపీ వైద్యుడు బండి వెంకన్నకు మత్తు మందు ఇచ్చి జమాల్‌కు ఇంజక్షన్‌ వేసి చంపేయాలని తెలిపాడు.
ఇద్దరూ ముదిగొండ మండలం బాణాపురం వద్ద కాపు కాసి పథకం ప్రకారం.. బైక్‌లో పెట్రోల్‌ అయిపోయిందంటూ లిఫ్ట్‌ అడిగిన ఆర్‌ఎంపీ వెంకన్న జమాల్‌ తుంటికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చాడు. ఏదో గుచ్చుకుందని జమాల్ బండి ఆపడంతోనే దిగి వేరే బైక్‌ మీద వచ్చిన వెంకటేశ్‌తో కలిసి పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి… రెండు బైక్‌లు, ఆరు సెల్‌ఫోన్లు, వినియోగించని మత్తుమందు బాటిల్‌, ఉపయోగించిన ఇంజెక్షన్‌ బాటిల్‌ను స్వాధీన పరచుకున్నారు. కేసును రెండు రోజుల్లోనే ఛేదించిన ఖమ్మం రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ మరియు అతని బృందాన్ని ఏసీపీ బస్వారెడ్డి అభినందించారు.

ఇదీ చదవండి: Shocking Death: ఆసుపత్రిలో అనూహ్య మరణం… పరామర్శకు వచ్చి తిరిగిరాని లోకాలకు…!

Exit mobile version