Site icon Prime9

Cancellation Of Leave: రేపు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రద్దు

telangana-government-cancelled-holiday-for-schools-and-colleges 12 november 2022

telangana-government-cancelled-holiday-for-schools-and-colleges 12 november 2022

Cancellation Of Leave: తెలంగాణలో రేపు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఈ నెల 12న రెండో శనివారం సందర్భంగా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ప్రతి నెల రెండో శనివారం రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.

కానీ.. ఈ నెలలోని రెండో శనివారంలో మాత్రం సెలవును రద్దు చేశారు. కానీ ఈ సెలవు రాష్ట్రం మొత్తం కాదని కేవలం హైదరాబాద్– సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. ఈ నెల 12వ తేదీన ఆయా కార్యాలయాలన్నీ పని చేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఎందుకు ఈ ప్రాంతాల్లోనే సెలవు రద్దు అంటే సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం పలు ప్రాంతాలకు సాధారణ సెలవుగా ప్రకటించింది. అందుకు బదులుగానే ఈ నెల 12న సెలవులను రద్దు చేసినట్లు ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి: రేపు రామగుండం బంద్- సీపీఐ నారాయణ

Exit mobile version