Site icon Prime9

Uttar Pradesh: సోషల్ మీడియా పరిచయం.. వైద్యులతో కలిసి అత్యాచారం

10th class girl gangraped in hyderabad

10th class girl gangraped in hyderabad

Uttar Pradesh: ప్రాణాలకు కాపాడాల్సిన ఈ వైద్యుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడో తెలిస్తే ఆక్రోషం వస్తుంది. సోషల్ మీడియా స్నేహాలు ఎంత దారుణాలకు ఒడిగడతాయో చెప్పేందుకు ఈ ఘటన ఓక ప్రత్యక్ష ఉదాహరణ. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళను తన ఆసుపత్రికి రమ్మని ఆహ్వానించిన వైద్యుడు మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ బస్తీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని కొత్వాలి ప్రాంతంలోని బస్తీ సదర్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడికి సోషల్ మీడియా ద్వారా ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిరువురి మధ్య మాటమాట పెరిగి ఆ తర్వాత వారి స్నేహం బలపడింది. ఈ క్రమంలో ఆ మహిళను ఒకసారి తన ఆసుపత్రిని రమ్మని వైద్యుడు ఆహ్వానించాడు. సరేనని ఆమె అతడిని కలిసేందుకు ఆసుపత్రికి వచ్చింది. సరదాగా మాట్లాడుతూ ఆమెను తన హాస్టల్ గదిలోకి తీసుకెళ్లిన ఆ డాక్టర్ అక్కడ తన స్నేహితులైన మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు సమీపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా ఈ ఘటన సెప్టెంబర్ అనగా గత నెల 27న జరుగగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. తదుపురి విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: పెళ్లింట విషాదం.. లోయలో పడి 25 మంది మృతి

Exit mobile version