Site icon Prime9

TDP Protest: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత… తాళ్లతో కట్టి మరీ… తెదేపా నేతల బలవంతపు అరెస్టులు

tdp leaders protest at assembly

tdp leaders protest at assembly

TDP Protest: తెలుగుదేశం నేతలు ఛలో అసెంబ్లీకి పిలుపు నివ్వడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అసెంబ్లీ పరిసరాలలోనూ చుట్టుపక్కల ఉన్న పొలాల్లోనూ డ్రోనులను తిప్పతూ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.  అసెంబ్లీకి దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసుల పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. అయినా కానీ పట్టువిడువని విక్రమార్కుల్లా తెదేపా నేతలు అసెంబ్లీ సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి నిరసన చేపట్టారు.

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని నిరసిస్తూ ఆందోళన చేశారు. ఈ నిరసనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు పాల్గొన్నారు. దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దానితో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు భవనంపై నుంచి బలవంతంగా కిందికి దించి అరెస్టు చేశారు. పోలీసులు, మహిళానేతలను తాళ్లతో కట్టి బలవంతంగా తీసుకుళ్లడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

అంతే కాకుండా అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పీఎస్ వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని టీడీఎల్పీ ఉప నేత చినరాజప్ప మండిపడ్డారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉండేవని.. కానీ ఇప్పుడు పేదల పథకాలను రద్దు చేసిన ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం ఉందని టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు.

ఇదీ చదవండి: RTC Fares during Dussehra: దసరాకు ఆర్టీసీలో సాధారణ చార్జీలే

Exit mobile version