Site icon Prime9

Attack on Etela Rajender Convoy: ఈటెల కాన్వాయిపై రాళ్ల దాడి..పలివెలిలో ఘటన

Stone attack on Etela convoy..Incident in Paliveli Village

Munugode: మునుగోడు ఉప ఎన్నికల వేడి నేటితో ముగియనున్న నేపథ్యంలో పలివెల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయిపై తెరాస కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈటెల భార్య స్వగ్రామం కావడంతో పలివెలి ప్రాంతంలో భాజపా ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొనింది. దీంతో ఈటెల భారీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు కేటిఆర్ రోడ్ షో అదే ప్రాంతంలో రానున్నడంతో టిఆర్ఎస్ కార్యకర్తలు అదే మార్గంలో బైక్ ర్యాలీ చేపట్టారు.

అయితే ఓ కూడలి వద్ద ఈటెల ర్యాలీపై తెరాస కార్యకర్తలు రాళ్లతో దాడులు చేశారు. దీంతో భాజపా కార్యకర్తలు కూడా కర్రలతో ఎదురు తిరిగారు. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్యకర్తలు మద్య ఘర్షణ తలెత్తింది. ఈటెల కారును పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతోపాటు భాజపా వాహనాలను ధ్వంసం చేశారు. పలివెలి గ్రామం రణరంగంగా మారింది. ఈటెల వ్యక్తిగత సిబ్బందికి తీవ్ర గాయం అయింది. ఎన్నికల ప్రచారంలో కీలక నేతల ప్రచారం నేపథ్యంలో తగిన భద్రతను కల్పించేందులో పోలీసులు పూర్తిగా విఫలం చెందారు. ఈటెల ర్యాలీ తెలిసీ కూడా తెరాస శ్రేణులను కట్టడి చేసేందులో పోలీసులు విఫలం చెందారు. ఒక దశలో భయానక వాతావరణం పలివెలిలో నెలకొనింది. రాళ్ల దాడిని ఈటెల ఖండించారు. పోలీసులు ప్రవర్తించిన చర్యను తప్పుబట్టారు.

ఘటనను మంత్రి జగదీశ్వర రెడ్డి సమర్ధించుకొన్నారు. మా కార్యకర్తలు ఎలాంటి దాడులు చేపట్టలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. రాళ్ల దాడి చేసిన విజివల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికి, మంత్రి ఘటనల్లో తెరాస కార్యకర్తలు ఎలాంటి దాడులు పాల్పొడలేదని చెప్పడాన్ని పలు పార్టీల నేతలు ఖండిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. సీఈవో వెల్లడి

Exit mobile version