Site icon Prime9

DJ Tillu Sequel: డీజే టిల్లు వచ్చేస్తున్నాడు.. పార్ట్-2 షూటింగ్ ప్రారంభం

DJ tillu part 2 shooting

DJ tillu part 2 shooting

DJ Tillu Sequel: కరోనా సెకెండ్ వేవ్ అనంతరం థియేటర్లకు సినిమాలను విడుదల చెయ్యాలా వద్దా అనుకుని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్న తరుణంలో డీజే టిల్లు రిలీజ్ అయ్యి బ్లాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఒక ఊపుఊపింది. ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న సిద్ధూ జొన్నలగడ్డకు ఈ చిత్రం మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 12 విడుదలైన ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని భారీ వ‌సూళ్ళను కొల్లగొట్టింది.
ఈ సినిమాలో సిద్ధూ నటన ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌లో అయితే సిద్ధూ ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.

కాగా ఈ సినిమా సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా డీజె టిల్లు సీక్వెల్‌ షూటింగ్‌ మొదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
కారు సీన్‌తో షూటింగ్‌ ప్రారంభం అయినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారట.

ఈ సినిమా పీడీవి ప్రసాద్ స‌మ‌ర్పణ‌లో సితార ఎంట‌ర్ట్‌టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు.
సీక్వెల్ చిత్రానికి కూడా సిద్ధూ క‌థ‌ను అందిస్తున్నాడు. కాగా ఈ సీక్వెల్‌ చిత్రాన్ని‘అద్భుతం’సినిమా దర్శకుడు మల్లిక్‌ రామ్‌ రూపొందిస్తున్నాడు.

ఇదీ చదవండి: నెట్టింట బాలయ్య సందడి.. NBK107 షూటింగ్ వీడియో వైరల్

Exit mobile version