Jio Laptop: అనేక కొత్తకొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీతో మార్కెట్లో ఇప్పటికే జియో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెట్‌లో రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. సామాన్యుల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే అనగా రూ.15వేలలో ల్యాప్ ట్యాప్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది.
జియో అధినేత ముఖేష్ అంబానీ ల్యాప్ టాప్ తరహాలో జియో బుక్ ను త్వరలో మార్కెట్లో రిలీజ్ చేయనున్నట్టు తెలిస్తోంది. ఈ ల్యాప్ టాప్ లో 4జీ సిమ్ కార్డును ఇన్ బిల్ట్ గా ఇవ్వనున్నారని, దానితో యూజర్లు ఎక్కడైనా నేరుగా ఇంటర్నెట్ వాడుకునేందుకు వీలుగా ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. దానికి గానూ టెక్ దిగ్గజమైన క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్ తో ఇప్పటికే జియో చేతులు కలిపింది. కాగా నూతనంగా ఈ లోబడ్జెట్ ల్యాప్ ట్యాప్ చిప్ కోసం యూకేకి చెందిన ఏఆర్‌ఎం కంపెనీతో జతకట్టినట్లు సమాచారం. ఈ చిప్‌తో విండోస్ ఓఎస్ తో పాటు మరికొన్ని యాప్స్ కూడా యూజర్లు వినియోగించుకునే సౌలభ్యం కలగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ల్యాప్ టాప్ ధర, ప్రత్యేకతలపై జియో వర్గాలు ఇప్పటి వరకు స్పందించలేదు.
జియోఫోన్ మాదిరిగానే, 5జీ ఎనేబుల్డ్ వెర్షన్‌ను ఈ ల్యాప్ ట్యాప్‌లో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ ల్యాప్ ట్యాప్‌లో జియో సొంత ఆపరేటింగ్ సిస్టం ‘జియో ఓఎస్’ ఉండనుందని, కావాల్సిన యాప్స్‌ను జియోస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చుని నివేదికలు చెప్తున్నాయి.
ఇదీ చదవండి: ఇన్‌స్టా లవర్స్ కు మరో కొత్త ఫీచర్.. నోట్స్ కూడా రాయొచ్చు..!