Site icon Prime9

Ramcharan, Upasana: తండ్రి కాబోతున్న రామ్‌చరణ్.. ఉపాసన గర్భవతి అని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి

Ram Charan

Ram Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారు. అవును మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు. హనుమంతుడి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అవుతున్నారు. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చిరంజీవి ట్వీట్ చేసారు.

రామ్ చరణ్- ఉపాసనకు పెళ్లి జరిగి పదేళ్లు కావొస్తోంది. ఇప్పటికి ఈ దంపతులకు పిల్లలు కాకపోవడంతో ఆ గుడ్‌ న్యూస్‌ కోసం అభిమానులు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్ప్పుడు ఆ ఎదురుచూపులకు తెర పడిందని మెగా అభిమానులు ఆ>నందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పేరు పెట్టని చిత్రంలో నటిస్తున్నారు.

Exit mobile version