Diwali: దేశవ్యాప్తంగా వైభవంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ దీపావళి. ఈ పర్వదినాన దీపాలను వెలిగించడంతో పాటు, బాణాసంచా కాల్చడం అనాదిగా వస్తోందన్న అచారంగా చెప్పవచ్చు. అయితే బాణాసంచా కాల్చడం ఈ ఏడాది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పలు కఠిన ఆంక్షలను విధించింది.
దీపావళి పండుగను ఈనెల 24న జరుపుకోనున్న విషయం తెలిసిందే. అయితే దీపావళి రోజున కాల్చే క్రాకర్స్ విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. బాణాసంచా కాల్చడం ద్వారా వచ్చే పొగతో కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని పరిగణలోకి తీసుకుని దీపాల వెలుగులో వేడుకలు జరుపుకోవాలని, అవసరమనుకుంటే ఇకో-క్రాకర్స్ ను పేల్చుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా కేవలం 2 గంటలు మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టం చేసింది. పండుగ వేళ బాణసంచా ఏఏ సమయాల్లో పేల్చాలో పూర్తి వివరాలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. పండుగ రోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒక గంట, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరో గంట మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు అనుమతించింది పొల్యూషన్ బోర్డ్.
ప్రజలకు ఈ విషయంపై ఆయా ప్రాంతాల్లోని పోలీసులు, స్థానిక సంస్థల అధికారులు అవగాహన కలిగించాలని బోర్డు సూచించింది. నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భారీ శబ్దాలు, పొగలు వచ్చే బాణా సంచాకు ప్రజలు దూరంగా ఉండాలని, ఇకో ఫ్రెండ్లీ టపాసులను మాత్రమే కాల్చాలని సూచించింది.
ఇదీ చదవండి: ఇకపై థియేటర్లలో సినిమాలే కాదు క్రికెట్ మ్యాచ్ లైవ్ కూడా..!