Site icon Prime9

Mumbai: 12 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. బాల్కనీలో వేలాడుతూ ప్రజలు..!

mumbai fire accident in 12 stares apartment

mumbai fire accident in 12 stares apartmentmumbai fire accident in 12 stares apartment

Mumbai: ముంబై మహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చెంబూర్‌లో 12 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోనే చాలామంది చిక్కుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు చాలామంది కిటికీల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు.

మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై నగరం, చెంబూర్‌, న్యూ తిలక్ నగర్ ప్రాంతంలోని 12 అంతస్తుల నివాస భవనంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాలా మంది మంటల్లో చిక్కుకుని తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నించారు. కిటికీల నుంచి బయటకు వచ్చి బాల్కనీలకు వేలాడుతూ రక్షించండి అంటూ వేడుకున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ముంబై అగ్నిమాపక దళం (MFB) అధికారులు 8 అగ్నిమాపక యంత్రాలు సహాయంతో మంటలను  అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమయంలో అగ్నిమాపక శాఖకు సమాచారం అందినట్లు వెల్లడించారు. అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టామని.. అదరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: కార్యకర్తను పెళ్లాడిన మహిళా ఎమ్మెల్యే.. ఎక్కడంటే..?

Exit mobile version