Mulayam Singh Yadav: ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.

Mulayam Singh Yadav: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం సోమవారం ఉదయం 8.30 గంటలకు మృతిచెందారు.

82 ఏళ్ల వయసున్న ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో ఆగస్టు 22వతేదీన ఆసుపత్రిలో చేరారు. కాగా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. దానితో అతన్ని ఐసీయూలోకి తరలించినట్లు సమాచారం అందిన వెంటనే కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్‌, తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా ములాయం ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కలేదు. నేటి ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ములాయం మృతి వార్త పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. ములాయం సింగ్ యాదవ్ కు ఇద్దరు భార్యలు వారిరువు స్వర్గస్థులయ్యారు.

ఇదీ చదవండి: ప్రయాణికులకు షాక్.. నేడు 163 రైళ్లు రద్దు