Site icon Prime9

KTR: శంషాబాద్ వరకూ మెట్రో.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

minister-ktr-tweet-on-hyderabad-metro second phase constructions

minister-ktr-tweet-on-hyderabad-metro second phase constructions

KTR: మెట్రో ప్రయాణికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రెండో ఫేజ్ ప‌నుల‌కు సంబంధించి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రోను విస్త‌రించాల‌ని నిర్ణ‌యించారు. దీనితో మైండ్ స్పేస్ జంక్ష‌న్ నుంచి శంషాబాద్ వ‌ర‌కు మెట్రోను విస్త‌రించ‌నున్నారు. రూ. 6,250 కోట్ల వ్య‌యంతో 31 కిలోమీట‌ర్ల మేర ఈ ప‌నుల‌ను చేప‌ట్టనున్నారు. డిసెంబ‌ర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ ఈ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నట్టు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా- పవన్ కళ్యాణ్ సవాల్

Exit mobile version