Site icon Prime9

Minister KTR: పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు… అసెంబ్లీలో కేటీఆర్ తీర్మానం

MINISTER KTR

MINISTER KTR

Minister KTR: పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

దేశానికి దార్శనికతను చూపిన వ్యక్తి అంబేడ్కర్ అని… సమానత్వమే అసలైన ప్రజాస్వామ్యని, స్వేచ్ఛ, సమానత్వాన్ని కోరిన వ్యక్తి అంబేడ్కర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అయిన పార్లమెంట్‌కు ఆయన పేరు కంటే గొప్పది ఏదీ లేదని అందుకే పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని కేటీఆర్ తెలిపారు.

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం సాధించాలని అంబేడ్కర్ ఆశించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం కోరిన వ్యక్తి అంబేడ్కర్ అని పేర్కొన్నారు. అంబేడ్కర్ తత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆచరణలో చేసి చూపిందని.. ఆయన లక్ష్యం సమానత్వమని.. తాను రాసిన రాజ్యాంగ దుర్వినియోగం అయితే స్వయంగా తానే దాన్ని తగులబెడతానని అంబేడ్కర్ వ్యాఖ్యానించినట్టు కేటీఆర్ వివరించారు. అందుకే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అయిన పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: TS Assembly Sessions 2022: అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే ఈటల సస్పెండ్

Exit mobile version