Site icon Prime9

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదన్న ఎమ్మెల్సీ కవిత

Kavitha writes to CBI on liquor summons: ‘Will cooperate but my name not there'

Kavitha writes to CBI on liquor summons: ‘Will cooperate but my name not there'

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేపట్టింది. ఇటీవలె కాలంలోనే తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా ఎఫ్ఐఆర్ లో నిందితుల జాబితాలో తన పేరు లేదని సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.

 ఎమ్మెల్సీ కవితను రేపు విచారణకు రావాలని సీబీఐ అధికారులు తెలిపారు. కాగా ముందుగా ఖరారైన కొన్ని కార్యక్రమాల నేపథ్యంలో, రేపటి విచారణకు తాను హాజరుకాలేనని ఆమె చెప్పారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా తన నివాసంలో విచారణ జరపవచ్చని ఆమె పేర్కొన్నారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, విచారణకు సహకరిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే ఇంతకు ముందే కవిత సీబీఐకి తొలి లేఖ రాశారు. ఐఎఫ్ఐఆర్ కాపీ, డాక్యుమెంట్లు తనకు పంపాలని.. ఆపై విచారణ తేదీని ఖరారు చేయవచ్చని ఆ లేఖలో ఆమె చెప్పారు. ఆమె కోరిన విధంగానే సీబీఐ అధికారులు వాటిని ఆమెకు పంపించారు. వాటిని పరిశీలించిన కవిత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని సీబీఐకి రెండో లేఖ రాశారు. మరి దీనిపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

ఇదీ చదవండి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు

Exit mobile version