Site icon Prime9

Janasena: పీఏసీలో పలు తీర్మానాలు చేసిన జనసేన.. వైసీపీపై నాదెండ్ల సంచలన కామెంట్స్

janasena PAC meeting

janasena PAC meeting

Janasena: ఏపీలో జనసేన మంచి స్పీడుతో దూసుకెళ్తోంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే వరుస కార్యక్రమాలతో జనసైనికుల్లో జోష్‌ నింపుతున్నారు పవన్‌. ఇకపోతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో నేడు పీఏసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, పీఏసీ‌ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.

ఈ మేరకు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి జనాదరణ పెరుగుతోందని, జన సైనికులను ఇబ్బందులు పెట్టేలా వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఎదుర్కొని నిలిచిన పవన్ కు చంద్రబాబు నాయుడు, సీపీఐ నారాయణ, రామకృష్ణ, లోక్ సత్తా పార్టీ నేతలు, బీజేపీ నేత సోమువీర్రాజు ఇలా పలువురు నేతలు సంఘీభావం ప్రకటించారు వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పీఏసీ మీటింగ్లో మొదటి తీర్మానం చేశారు. విశాఖ ఘటన నేపథ్యంలో అక్రమ కేసుల కారణంగా పోలీస్ స్టేషన్ల పాలైన నేతలు, వీర మహిళలు, జనసైనికులు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడిన పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలుపుతూ రెండో తీర్మానం చేసినట్టు జనసేన వివరించింది. అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేసిన జనసైనికులు, వీరమహిళలకు న్యాయపరమైన సహాయం అందించిన పార్టీ న్యాయ విభాగం సభ్యులను, న్యాయవాదులను అభినందిస్తూ కూడా ఓ తీర్మానం చేసినట్టు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అంతే కాకుండా వచ్చే నెలలో మరోసారి పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన చేస్తారని జనసేన పార్టీ వెల్లడించింది.

ఇకపోతే సోమవారం, రాజమండ్రిలోని ఓ హోటల్‌లో వైసీపీ కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమావేశం కానుండటం నేపథ్యంలో ఈ రోజు జనసేన సమావేశం ఏర్పాటు చెయ్యడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదీ చదవండి: ఒళ్లు మ‌రిచి ఓటేస్తే ఇల్లు కాలిపోతుంది.. జర ఆలోచించండి- సీఎం కేసీఆర్

Exit mobile version