Site icon Prime9

Naga Shaurya: హీరో నాగశౌర్యకు అస్వస్థత.. ఏఐజీ ఆసుపత్రిలో చేరిక

hero-nagashaurya-falls-ill

hero-nagashaurya-falls-ill

Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం షూటింగ్ లో ఉండగా అతడు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. దానితో షూటింగ్ నిలిపివేసి నాగశౌర్యని హుటాహుటిన హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు చిత్ర బృందం. దీనిపై ఇంకా ఎటువంటి పూర్తి వివరాలు తెలియరాలేదు. ఇదిలా ఉంటే నాగశౌర్య ఇటీవలే బెంగళూరుకి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనెల 20వ తేదీన ఉదయం 11గంటల 25 నిమిషాలకు వీరి వివాహం జరగనుంది.

కాగా ప్రస్తుతం నాగశౌర్య, అరుణాచలం దర్శకత్వంలో తన 24వ సినిమాను ప్రారంభించాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ మీద శ్రీనివాసరావు, విజయ్ కుమార్, అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: అర్జున్‌ కపూర్‌తో పెళ్లికి ఓకే చెప్పిన మలైకాఅరోరా.. హాట్‌ టాపిక్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌

Exit mobile version