Site icon Prime9

Ap Congress: ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ చీఫ్ నియామకం

gidugu-rudraraju-appointed-as-apcc-chief

gidugu-rudraraju-appointed-as-apcc-chief

Ap Congress: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలైయ్యింది. ఏపీలో ఉనికి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చీఫ్ ని నియమించింది అధిష్టానం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గిడుగు రుద్రరాజుకు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది. కాగా ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను తప్పించి ఆయన స్థానంలో రుద్రరాజును కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమించారు. అలాగే, 18 మందితో కూడిన పొలిటికల్ అఫైర్స్ కమిటీతోపాటు 34 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించారు. సీనియర్ నేత హర్షకుమార్‌, తులసిరెడ్డిలకు కూడా పదవులు లభించాయి.

మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాజేశ్‌లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించిన అధిష్ఠానం. హర్షకుమార్‌ను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. మరో సీనియర్ నేత తులసిరెడ్డి మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని రుద్రరాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు.. రూ. 6కోట్ల నగదు స్వాధీనం

Exit mobile version