Site icon Prime9

Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీ పేరు ప్రకటన నేడే..!

ghulam nabi azad new party announcement today

ghulam nabi azad new party announcement today

Ghulam Nabi Azad: జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. కాంగ్రెస్‌ పార్టీకి ఎనలేని సేవలందించి, గత కొద్ది కాలంగా పార్టీ నుంచి సంబంధ బాంధవ్యాలు తెంచుకున్న గులాం నబీ ఆజాద్‌ నేతృత్వంలో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కాగా నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఆజాద్‌ మీడియా వేదికగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే, జాతీయ పార్టీనే ప్రకటిస్తారని తెలుస్తుంది. ముందుగా జమ్ముకశ్మీర్‌తో ప్రారంభించి ఆ తర్వాత పార్టీని మిగతా రాష్ట్రాలకు విస్తరించనున్నారని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కశ్మీర్‌లో ఆజాద్ ఒంటరిగా పోటీచేయనున్నారు. కాగా ఆయన ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకోనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు.

గతనెలలో ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాహుల్ కు పార్టీ నడిపే సామర్థ్యం లేదని, పార్టీలో మారిన రాజకీయ పరిస్థితిలే తన రాజీనామాకు కారణమని తెలుపుకొచ్చారు.

ఇదీ చదవండి: Opposition meet: ప్రతిపక్షాలతో మీట్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాతే

 

Exit mobile version