Site icon Prime9

Ex Minister Anil Kumar Yadav: అయ్యప్ప మాలలో ముస్లిం టోపీ ధరించిన మాజీమంత్రి.. బీజేపీ నేతలకు స్ట్రాంగ్ క్లారిటీ

ex-minister-anil-kumar-yadav-clarity-on-wearing muslim-cap

ex-minister-anil-kumar-yadav-clarity-on-wearing muslim-cap

Ex Minister Anil Kumar Yadav: అయ్యప్ప మాలలో ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముస్లిం టోపీ ధరించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని బీజేపీ, బీజేవైఎం నేతలు మండిపడ్డారు. ఆయన ఇంటిని కూడా ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాగా తాను ముస్లిం టోపీ ధరించడంపై మాజీ మంత్రి వివరణ ఇచ్చారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు.

అయ్యప్ప మాలలో ఉన్న నేను ఏదో పాపం చేసినట్లు బీజేపీ, బీజేవైఎం నాయకులు ఓవరాక్షన్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నా ఇంటి ముందు ధర్నా చేసిన పిల్లలకు ధర్మాలు అనేవి తెలియదు పాపం. సోము వీర్రాజు వంటి పెద్దలు కనీసం ఆలోచన చేయాలి కదా అంటూ విమర్శించారు. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అయ్యప్ప భక్తులందరూ ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకుంటారు. ఈ విషయం కూడా తెలియదా..? వావర్ స్వామి ముస్లిం కాదా..? అని ఆయన ప్రశ్నించారు.

ఓట్ల రాజకీయం, నీచ రాజకీయం ఎవరు చేస్తున్నారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ చురకలు అంటించారు. ముస్లిం దేవతలను ప్రార్థించే వారిలో సగానికి సగం మంది హిందువులే ఉంటారు. నేను హిందువులను అవమానించినట్లు వాళ్లు మాట్లాడటం సరికాదు. నేను చేసింది తప్పు కాదని ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, బేజేవైఎం నేతలు విజ్ఞతతో ఆరోపణలు చేయాలి అని అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌ లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక ముస్లింలను కలిసేటప్పుడు వారి మతాచారాలకు అనుగుణంగా టోపీ, కండువా ధరించారు.

ఇదీ చదవండి: విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ దొరకాలని స్వామివారిని కోరుకున్నాను.. అయ్యన్నపాత్రుడు

Exit mobile version