Site icon Prime9

Juice Instead Of Plasma: ఎంత దారుణం.. ప్లాస్మాకు బదులుగా బత్తాయిరసం ఎక్కించారు

juice instead of blood incident in UP prayagraj

juice instead of blood incident in UP prayagraj

Juice Instead Of Plasma: రక్తదానం ఎన్నో ప్రాణాన్ని నిలబెతుంది. అలాంటి రక్తం లభించే బ్లడ్ బ్యాంక్ ను ఎంతో పవిత్రమైన దేవాలయంగా భావిస్తాం. అయితే ఓ బ్లడ్ బ్యాంక్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించింది. పూర్తి నిర్లక్ష్యపు వైఖరితో నిండుప్రాణాన్ని బలికొంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఓ బ్లడ్‌ బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లై చేసిన వైనం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలాఖా అయిన ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్‌ దవాఖానలో ఇటీవల ఓ వ్యక్తి డెంగ్యూ జర్వంతో అడ్మిట్ అయ్యాడు. అయితే ప్లేట్ లెట్స్ పడిపోయాయని అతడికి ప్లాస్మా ఎక్కించాలని వైద్యులు సూచించారు. దానితో రోగి కుటుంబ సభ్యులు సమీపంలోని బ్లడ్‌ బ్యాంకును ప్లాస్మా కోసం సంప్రదించారు. కాగా బ్లడ్‌బ్యాంకు సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్లాస్మా బ్యాగ్‌లో బత్తాయి రసం నింపి ఇచ్చారు. అయితే వైద్యులు దానిని పరిశీలించకుండానే రోగికి ఎక్కించేశారు. దానితో రోగి శరీరంలో బ్లడ్లో జ్యూస్ చేసి మరణించాడు. ఈ దారుణాన్ని గుర్తించిన రోగి బంధువు ఒకరు బత్తాయి రసం ఉన్న బ్లడ్‌ బ్యాగును చూపుతూ ఓ వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయటంతో ఈ విషయం తీవ్ర కలకలం రేగింది. దీనిపై రియాక్ట్ అయిన పోలీసు బృందం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు పోలీస్‌ అధికారి రాకేశ్‌సింగ్‌ తెలిపారు.

ఇదీ చదవండి: చెప్పుతో కొట్టి.. ఆసుపత్రి నుంచి తన్నితరిమేశారు..!

Exit mobile version