CM YS Jagan: ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకన్న నేపథ్యంలో తాజాగా బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యులను కూడా సీఎం జగన్‌మోహన్ రెడ్డి మార్చారు. మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ లను నియమించారు. అదేవిధంగా బీఏసీలో లేజిస్లేటివ్ అఫైర్ కో-ఆర్డినేటర్‌గా గడికోట శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 15వ తేదీ నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలతో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తెరపైకి రానుందనే టాక్ వినిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపి.. వచ్చే ఎన్నికల్లోపు విశాఖలో తిష్ట వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో రాష్ట్ర మంత్రులు కూడా వెల్లడించారు.
అయితే, రేపటి నుంచి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానుంది.. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి నుంచి అరసవల్లి వరకు రైతులు పాదయాత్ర చేపట్టునున్నారు. ఇదే క్రమంలో అసెంబ్లీ సమావేశాలు జరగడం అటు ఉత్తరాంధ్ర మీదుగా రైతుల పాదయాత్ర సాగడం జరుగనుండడంతో ఏపీ ప్రజల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొనింది.
ఇదీ చదవండి: KCR New Party: ’కారు‘ దిగవద్దంటున్ననేతలు.. కేసీఆర్ జాతీయపార్టీ గుర్తు అదేనా?