Site icon Prime9

Gujarat Elections: అదృశ్యమైన ఎమ్మెల్యే.. అడవిలో ప్రత్యక్షం.. ఏం చెప్పారంటే..?

BJP goons chased me with swords, hid in jungle said by Missing Congress MLA

BJP goons chased me with swords, hid in jungle said by Missing Congress MLA

Gujarat Elections: గుజరాత్ ఎన్నికల సందర్భంగా పారిపోయిన ఓ ఎమ్మెల్యే ఇప్పుడు అడవుల్లో ప్రత్యక్షమయ్యారు. బీజేపీ దాడితో అదృశ్యమైనట్టుగా చెబుతున్న గుజరాత్‌లోని దంతా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంతి ఖరాడిని పోలీసులు ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చారు. గుజరాత్ రెండో విడత పోలింగ్ ప్రారంభం కావడానికి ముందు ఆయన బయటకు వచ్చారు. జరిగింది దురదృష్ణకర ఘటన అని ఆయన పేర్కొన్నారు. తన ప్రాంతంలో ఎన్నికలు ఉండడంతో అక్కడి ప్రజలను కలిసేందుకు వెళ్తుంటే ఇలా జరిగిందని.. ‘ నా ఓటర్లను కలిసేందుకు వెళ్తుండగా ఎల్‌కే బరాద్, ఆయన సోదరుడు వదన్ జీ, బీజేపీ అభ్యర్థి లడ్డు పర్ఘి తదితరులు నాపై దాడిచేశారు. కత్తులతో నాపై దాడికి పాల్పడ్డారు’ అని ఎమ్మెల్యే ఖరాడిని ఆరోపించారు.

తాము బమోదర ఫోర్ వే గుండా వెళ్తుండగా బీజేపీ దంతా నియోజకవర్గ అభ్యర్థి తాము వెళ్లకుండా రహదారిని బ్లాక్ చేశాడని పేర్కొన్నారు. తాము కార్లలో తిరిగి వెళ్తుంటే తమ కార్లను వెంబడించారని, అన్నారు. దీంతో తాము తప్పించుకోవాలని చూశామని, 10-15 కిలోమీటర్లు పరిగెట్టి ఓ అడవిలో దాక్కున్నామని తెలిపారు.

తనపై దాడి జరిగే అవకాశం ఉందని నాలుగు రోజుల క్రితమే ఎన్నికల అధికారికి లేఖ రాశానని ఖరాడి తెలిపారు, అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ దాడి జరిగేది కాదని అన్నారు. కాగా, ఎమ్మెల్యేను ఓ అడవిలో గుర్తించి తీసుకొచ్చిన దంతా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. దంతా సీటు ఎస్టీ రిజర్వుడు. కాంగ్రెస్ నుంచి ఖరాడి బరిలో ఉండగా, బీజేపీ నుంచి లడ్డు పర్ఘి పోటీ చేస్తున్నారు. తాజాగా, జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో ఈ సీటు కూడా ఉంది.

ఇదీ చదవండి: గుజరాత్ రెండో విడత ఎన్నికలు ప్రారంభం

Exit mobile version