GHMC: ఇటీవల కాలంలో లవర్స్ అడ్డా ఏదైనా ఉందా అంటే టక్కున గుర్తొచ్చేది పార్క్. ఇంక హైదరాబాద్ నగరంలోని వివిధ పార్కుల్లో బహిరంగంగానే కొంతమంది ప్రేమికులు రొమాన్స్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇందిరా పార్క్, కృష్ణకాంత్ పార్క్ లాంటి పార్కుల్లో కొందరు ప్రేమికుల రొమాన్స్ చూడలేక ఓ వైపు మరోవైపు కొన్ని పార్కుల్లో చైన్ స్నాచింగ్ వంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఫ్యామిలీలు పార్క్ కు వెళ్లాలంటే కాస్త జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
భాగ్యనగరంలోని ఔటర్ రింగు రోడ్డు పరిధిలో ఐటీ, ఫార్మా, సర్వీస్ సెక్టార్లు విస్తరిస్తున్న తరుణంలో ‘పబ్లిక్ సేఫ్టీ మెజర్స్’లో భాగంగా భద్రత ప్రమాణాలను మరింత పటిష్టం చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు పార్కుల్లోనూ 8వేల సీసీ కెమెరాలు పెట్టేందుకు సిద్ధమయ్యింది. దీనికి గానూ ఇటీవల తయారు చేసిన ప్రతిపాదనకు బుధవారం నాడు జీహెచ్ఎంసీ ఆమోదముద్ర వేయనుంది. దీని కోసం రూ.19.18 కోట్ల పనులను ఈఈఎస్‌ఎల్ కంపెనీకి అప్పగించింది. దీనితో నగరంలోని పలు ప్రాంతాలతో పాటు మురికివాడలు, పార్కుల్లోనూ 8వేల కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఇకపోతే ప్రస్తుతం నగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకూ 7.50 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు వాటికి అదనంగా మరో 8వేలు కెమెరాలు ఏర్పాటకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వ “అప్పుల” తిప్పలు.. మరోసారి రూ.1,413 కోట్ల రుణం