Ap Intermediate Board: విద్యార్థిని చితకబాదిన లెక్చరర్… రంగంలోకి దిగిన ఇంటర్మీడియట్ బోర్డ్

స్టూడెంట్ పై లెక్చరర్ దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఫైర్ అయ్యింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Ap Intermediate Board: స్టూడెంట్ పై లెక్చరర్ దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఫైర్ అయ్యింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

విజయవాడ చైతన్య కళాశాలలో శుక్రవారం ఓ విద్యార్థిపై అధ్యాపకుడు దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనపై ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు సీరియస్ అయ్యింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు అందడం వల్ల ఇంటర్మీడియట్ విద్యామండలి జాయింట్ సెక్రటరీ జీఎస్ఆర్ కృష్ణారావు ఆ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. చైతన్య కాలేజీ భాస్కర్ క్యాంపస్కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. క్యాంపస్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. సరైన వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

కాగా ఇప్పటికే లెక్చరర్ రవికుమార్, ప్రిన్సిపాల్ నుంచి ఈ ఘనటకు సంబంధించి వివరాలను సేకరించారు.
ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సీఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐఓ రవికుమార్, చైల్డ్ లైన్ అధికారులతో విచారణ చేపట్టామని జీఎస్ఆర్ కృష్ణారావు తెలిపారు. దీనికి సంబంధించి చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: NIA Raids: లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు… ఎన్ఐఏ సోదాలు