Site icon Prime9

Another Injection Murder In Khammam: మరో సూది మందు హత్య… రెండో భార్యని వదిలించుకోవడానికే ప్లాన్..!

Another Injection Murder In Khammam

Another Injection Murder In Khammam

Another Injection Murder In Khammam: ఖమ్మం జిల్లాలోనే మరో ఇంజక్షన్ హత్య వెలుగు చూసింది. బైక్ పై లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన వెలుగులోకి రావడం ఖమ్మం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.

వివరాల్లోకి వెళ్తే… బిక్షం అనే వ్యక్తి తన రెండో భార్యను హత్య చేసేందుకు ఇంజెక్షన్ తో హత్య చేయ్యాలనే ప్లాన్ చేశాడు. డెలివరీ కోసమని రెండో భార్యను బిక్షం తీసుకెళ్లి ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. ఆమెను చంపే క్రమంలో ఎవరూ లేని సమయం చూసి సెలైన్ బాటిల్లో పాయిజన్ ఇంజక్షన్ ఎక్కించాడు. దానితో ఆమె కొద్ది సమయానికి మృతి చెందింది. కాగా నేరం తన మీదకు రాకుండా ఉండాలని… వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని ఆసుపత్రిలో ఆందోళన చేశాడు.

వైద్యులు తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాక ఆసుపత్రి సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. భర్తే ఆమెకు పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చాడని ఆసుపత్రి యాజమాన్యం ఖమ్మం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఏది ఏమైనా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఇంజెక్షన్ హత్యలు వెలుగుచూడడం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.

ఇదీ చదవండి: Khammam Injection Murder: ఇంజెక్షన్ హత్య… సూత్రధారి భార్యే… పథకం ప్రకారమే..!

Exit mobile version