Syria Boat Accident: ప్రపంచంలో ఏదో ఓ మూల రోజూ మరణ వార్తలు వింటూనే ఉన్నాం. అందులోనూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాని వలసవెళ్లే వారూ ఉంటారు. కాగా తాజాగా సిరియాలో ఘోర ప్రమాదం జరిగింది. సిరియా తీరంలో బోటు బోల్తాపడి దానిలోని 77 మంది ప్రయాణికులు మృతి చెందారు. మృతులంతా వలసదారులుగా అధికారులు గుర్తించారు.
బతుకు దెరువు కోసం అక్రమ మార్గంలో వలస వెళ్లే క్రమంలో సిరియాలో ప్రమాదం చోటు చేసుకుంది. లెబనాన్ నుంచి దాదాపు 150 మందితో బయలుదేరిన పడవ ప్రమాదానికి గురయ్యింది. సిరియా తీరానికి సమీపన పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 77 మంది నీటమునిగి చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. కాగా గల్లంతయిన వారిలో 20 మందిని కాపాడారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పడవ ఐరోపా వైపు వెళ్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా పడవలో లెబనాన్, సిరియా, పాలస్తీనా వాసులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: Viral News: ఏడాదిన్నరగా ఇంట్లోనే డెడ్ బాడీ.. తీరా చూస్తే ఘోరం..!