Site icon Prime9

Crime News: బాత్రూంలో బట్టలు మార్చుకుంటున్న వీడియో తీసి..!

mp crime news

mp crime news

Crime News: బాత్రూమ్‌లో 19 ఏళ్ల యువతి దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాన్ని ముగ్గురు విద్యార్థులు వీడియో తీశారు. ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరించి ఆమె నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. తీరా చూస్తే అసలు విషయం తెలుసుకుని రంగ ప్రవేశం చేసిన పోలీసులకు నిందితుల్లో ఒకరు చిక్కారు, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్‌లో రాష్ట్రం భోపాల్‌ నగరంలోని గోవింద్‌పురా ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ)లో నిందితులు, బాధితురాలు చదువుతున్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇన్‌స్టిట్యూట్‌లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా దానికి హాజరైన ఓ విద్యార్థిని ఇన్‌స్టిట్యూట్‌లోని బాత్రూంలో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ముగ్గురు యువకులు కలిసి ఆమెను వీడియో తీశారు. ఆ వీడియోను నిందితులలో ఒకరు బాధితురాలి స్నేహితులలో ఒకరికి చూపించి, రూ. 7,000 డిమాండ్ చేశాడు. ఒక వేళ డబ్బులు ఇవ్వకుంటే.. వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని బెదిరించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

దానితో యువతి కుటుంబ సభ్యులు పిప్లానీ పోలీస్ స్టేషన్ వెళ్లి బాలిక అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బాధితురాలిని గుర్తించారు.
ఆ తర్వాత ఏం జరిగిందని విచారించగా బాత్రూం వీడియో విషయం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు తర్వాత ఆ కేసును ఇన్‌స్టిట్యూట్‌ పరిధిలోని అశోక్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఫ్లిపాని పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అజయ్ నాయర్ తెలిపారు. కాగా నిందితులలో ఒకరి అరెస్ట్ చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: Mahaboobnagar Crime News: ఏం కష్టమొచ్చిందో పాపం ఆ తల్లికి.. ముగ్గురు పిల్లలతో సహా చెరువులో దూకి..!

Exit mobile version