Site icon Prime9

Football: ఆట చూడడానికి వచ్చి..127 మృతి చెందారు..!

Indonesia football stampede

Indonesia football stampede

Football: స్టేడియంలోనే 127 మంది మృతి చెందారు. దాదాపు మరో 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్‌ జావాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఇండోనేషియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ శనివారం రాత్రి ఈస్ట్‌ జావాలోని మలాన్‌ రెగెన్సీలో ఉన్న స్టేడియంలో ఘనంగా జరిగింది. చిరకాల ప్రత్యర్థులైన పెర్సెబాయ సురబాయ, అరెమా జట్లు ఒకరికొకరు తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్‌లో అరెమా జట్టు ఓటమిపాలయ్యింది. దానితో సొంత స్టేడియంలో ప్రత్యర్థి చేతిలో తమ జట్టు ఓడిపోవడం చూసి ఫుట్ బాల్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలోకి దూసుకుపోయి రచ్చరచ్చ చేశారు. దానితో పెర్సెబాయ జట్టు అభిమానులు సురబాయ జట్టు అభిమానులపై దాడికి పాల్పడ్డారు. దీనితో ఇరుజట్ల ఫ్యాన్స్ మధ్య తీవ్ర తోపులాట ఘర్షణ చోటుచేసుకుంది. ఇది గమనించిన పోలీసులు రంగంలోకి దిగి మైదానంలో ఉన్న క్రీడా అభిమానులపై లాఠీచార్జ్ ఝులిపించారు. అభిమానుల ఘర్షణను అదుపుచేసేందుకు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు.

ఈ నేపథ్యంలో అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 34 మంది అక్కడికక్కడే మృతిచెందగా సుమారు 300 మంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. మరికొంత మంది చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. మొత్తంగా దాదాపు 127 మంది ఈ తొక్కిసలాటలో మరణించారని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు, చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘోర దుర్ఘటనపై ఇండోనేషియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ దర్యాప్తుకు ఆదేశించింది.

ఇదీ చదవండి: పాక్ బ్యాటర్ దెబ్బ.. అంపైర్ అబ్బ..!

Exit mobile version