Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని దేశమంతా విస్తరించే క్రమంలో శరవేగంగా దూసుకుపోతోంది.
ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది.
జియో తాజా ప్రకటనతో దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను తీసుకొచ్చినట్టు టెలికాం దిగ్గజం ప్రకటించింది.
17 రాష్ట్రాల్లోని మరో 50 నగరాలకు 5జీ సేవల్ని విస్తరించడం ఎంతో సంతోషంగా ఉందని రిలయన్స్ జియో ప్రకటించింది.
5 జీ సేవలు అందుబాటులోకి వచ్చాక ఒకేసారి ఇన్ని నగరాలకు విస్తరించడం ఇదే మొదటిసారి.
ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్ గఢ్, గోవా, హర్యానా, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఝార్ఘండ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల పరిధిలోని
కొన్ని సిటీలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరితో తాజాగా 5 జీ సేవలను ప్రారంభినట్టు జియో తెలిపింది.
ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్, కోర్బా, అస్సాంలోని నాగాన్, గోవా రాజధాని పనాజీ, హర్యానా లోని అంబాలా, హిస్సార్, కర్నల్, పానిపత్, రోహ్ తక్, కర్ణాటకలోని హసన్, మాండ్య నగరాల్లో..
కొత్తగా 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్‍లోని చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరంలో కొత్తగా
5జీ సర్వీస్‍లను జియో ప్రారంభించింది. తెలంగాణలోని నల్గొండలో 5జీ నెట్‍వర్క్‌ను తీసుకొచ్చింది.
ఏపీలో 16, తెలంగాణలో 6 సిటిల్లో..
జియో తాజా రోల్ అవుట్‍తో ఆంధ్రప్రదేశ్‍లోని 16 నగరాల్లో జియో 5జీ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలోని 6 సిటీల్లో జియో ట్రూ 5జీ నెట్‍వర్క్ ఉంది. ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, తిరుమల, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, కాకినాడలో ఇప్పటి వరకు జియో 5జీ ఉండగా.. నేడు చిత్తూరు, కడప, నరసరావుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం సిటీల్లో అందుబాటులోకి వచ్చింది. ఇక తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‍లో ఇప్పటికే జియో 5జీ నెట్‍వర్క్ ఉండగా.. తాజాగా నల్గొండలో అందుబాటులోకి వచ్చింది.
అపరిమిత డేటాతో వెల్ కమ్ ఆఫర్
ఇక ఈ నగరాల్లో జియో వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 1 జీపీఎస్ ప్లస్ వేగంతో అపరిమిత డేటా పొందేలా జియో వెల్ కమ్ ఆఫర్ ను ప్రకటించింది. జియో ట్రూ 5 జీ సేవలు పొందాలంటే కస్టమర్లు 5 జీ మొబైల్ , సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదు. ఆటో మేటిక్ గా సర్వీస్ అప్ గ్రేడ్ అవుతుంది.
5జీ లోనూ జియో టాప్
ప్రస్తుతం జియో 5జీ సేవలు పొందుతున్న నగరాల సంఖ్య మొత్తం 184కి చేరింది. దీంతో రిలయన్స్ జియో అత్యధికంగా 5 జీ సేవలు అందించే ఆపరేటర్ ఎదిగింది. ఇంతకుముందు ఎయిర్ టెల్ అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా జియో అగ్రస్ధానంలో నిలిచింది. 4జీ సేవలను అందించడంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/