Prime9

CM Jagan: ప్రతి విద్యార్థిని చదివస్తా- సీఎం జగన్

CM Jagan: పిల్లల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని వారికి మనం ఇచ్చే ఆస్తి చదువేనని సీఎం జగన్ పేర్కొన్నారు.  నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేశారు సీఎం జగన్. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకే బటన్ నొక్కి జమ చేశారు.

పాదయాత్ర సందర్భంగా తాను ఇచ్చిన హామీలు గుర్తున్నాయని.. ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని.. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కుటుంబాల తలరాత మారాలంటే, పేదరికం దూరం కావాలంటే, చదువు మార్గమని సీఎం జగన్ అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానంటూ భరోసా ఇచ్చారు.

మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటాను. మీ పిల్లలను పూర్తిగా చదవించే బాధ్యత నాది. పిల్లల చదవుతో ఇంటింటా వెలుగు నింపాలని నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామని, ఉపాధిగా చేరువగా విద్యారంగాన్ని తీసుకెళ్తున్నాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉన్నత విద్యలో కూడా మార్పులు తెచ్చామని సీఎం జగన్ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో విద్యారంగానికి మొత్తం రూ. 55 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ వెల్లడించారు.

ఇదీ చదవండి: శ్రీవారి బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు.. రేపటి నుంచే అమలు

Exit mobile version
Skip to toolbar