Prime9

Mohan babu: నటుడు మోహన్ బాబుకు కోర్టులో ఊరట

Tirupati: 2019లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్ మెంటు ఇవ్వాలంటూ మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ లు జాతీయ రహదారి పై బైఠాయించి ధర్నా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిరసనలు, ధర్నాలతో పాటుగా ఎలక్షన్ కమీషన్ పరిధిలోనే ఏదేని కార్యక్రమం చేపట్టాలి. దాన్ని ధిక్కరిస్తూ రాజకీయ లబ్దిని కోరుకుంటూ అప్పట్లో మోహన్ బాబు చేపట్టిన ధర్నా రాష్ట్రంలో పెద్ద దుమారం సృష్టించింది. అయితే అనంతరం వచ్చిన ప్రభుత్వం కూడా ఫీజు రీయంబర్స్ మెంటు పై పెద్దగా దృష్టి సారించలేదు. కానీ మోహన్ బాబు కుటుంబం మౌనంగానే ఉండడంతో రాజకీయ ధర్నాగానే నాటి ఘటనను ప్రజలు భావిస్తున్నారు.

ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన వారికి త్వరితగతిన శిక్షలు ఖరారు చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అలా కాకుండా మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికల వస్తున్న తరుణంలో సైతం కేసులు వాయిదాల రూపంలో నడవడంపై ప్రజలు పెదవి విరుపులు విరుస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar