Site icon Prime9

Uttar Pradesh: కోతికి జీవిత ఖైదు.. ఎందుకో తెలుసా..?

officials-in-uttar-pradesh-have-sentenced-a-monkey-to-life-imprisonment

officials-in-uttar-pradesh-have-sentenced-a-monkey-to-life-imprisonment

Uttar Pradesh: మనిషి తప్పు చేస్తే జీవిత ఖైదు విధించడం చూశాము. కానీ ఓ కోతికి కూడా జీవిత ఖైదు విధించారు. ఇకపై అది జీవితాంతం బోనులో ఉండాల్సిందే. అంతగా ఆ కోతి ఏం చేసింది ఎందుకు, ఎక్కడ దానికి జీవిత ఖైదు విధించారో ఓ సారి చూసేద్దాం.

ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్‌లో ఓ మాంత్రికుడి వద్ద కాలియా అనే పేరుగల కోతి ఉండేది. దానికి అతడు మద్యం, మాంసం అలవాటు చేశాడు. కాగా ఒకరోజు అకస్మాత్తుగా అతను మరణించాడు దానితో ఆ కోతి ఆలనాపాలనా చూసే వారు కరువయ్యారు. మద్యం మాంసానికి అలవాటు పడిన వానరం వాటికోసం ప్రజలపై దాడి చెయ్యడం మొదలుపెట్టింది. అంతేకాకుండా మద్యం దుకాణం వద్ద కాపుకాసేది. మద్యం సీసాలు కొనుక్కుని వెళ్తున్న వారిపై దాడిచేసి వాటిని ఎత్తుకెళ్లేది. ఇలా 250 మందిపై దాడి చేసి గాయపరిచింది. దాని బాధలు భరించలేని స్థాయికి చేరుకోవడంతో 2017లో స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
వారొచ్చి దానిని పట్టుకుని జూలో బంధించారు. ఆ తర్వాత దానికి వైద్యం అందించారు. ఐదేళ్లపాటు దానికి వైద్యం అందించినా దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇకపై దానిని జూలోనే జీవితాంతం బందీగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇలా ఆ కోతికి జీవిత ఖైదు అనుభవిస్తుంది.

ఇదీ చదవండి: కాలిచెప్పును పట్టుకుపోయిన పాము

Exit mobile version