Site icon Prime9

Nara Brahmani: బైక్ రైడ్‌లో అదరగొట్టిన నారా బ్రాహ్మణి.. వైరల్ అవుతున్న వీడియో

nara-brahmani-bike ride-in-ladakh video goes viral

nara-brahmani-bike ride-in-ladakh video goes viral

Nara Brahmani: టాలీవుడ్‌ స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ ముద్దుల, తెదాపా అధినేత చంద్రబాబు నాయుడి కోడలు, నారా లోకేష్ భార్య అయిన నారా బ్రాహ్మణి లద్దాఖ్‌లో బైక్‌ రైడ్‌ చేసి అందరినీ అబ్బురపరిచారు. బ్రాహ్మణికు బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం. ఆమె ఒక ప్రొఫెషినల్‌ బైక్‌ రైడింగ్‌ గ్రూపులో మెంబర్‌ కూడా. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో పాల్గొన్నారు బ్రాహ్మణి. స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ –లడక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ట్రావెల్ చేశారు.

హిమాలయ పర్వతాల మధ్య బైక్‌పై దూసుకెళ్తూ అక్కడి నేచర్‌ను ఎంజాయ్‌ చేశారు. ప్రమాదకరమైన రోడ్ల మీద సునాయాసంగా బరువు కలిగిన భారీ బైక్‌ రైడింగ్ చేసి అందరి నోర్లు మూయించారు. బైక్‌ రైడ్‌లో తన అనుభవాలను బ్రాహ్మణి వీడియోలో పంచుకున్నారు. ‘లద్దాఖ్‌ చాలా అద్భుతంగా, అందంగా ఉంది. రైడ్‌ను చాలా ఎంజాయ్‌ చేశాను. ఇప్పుడు టైమ్‌ 6:30 అయ్యింది. ఉదమయే బయల్దేరి థక్‌సే ఆరామానికి చేరుకున్నాం’ అని బ్రాహ్మణి పేర్కొన్నారు. ఈ ట్రావెల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా ప్రస్తుతం ఆమె హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. చిన్ననాటి నుంచి ఇటు సినీ, రాజకీయ రంగాలను దగ్గరగా చూశారు నారా బ్రహ్మణి. ఆ రెండింటిని కాకుండా వ్యాపారంలోనూ తనకంటూ గుర్తింపు ఏర్పర్చుకున్నారు అలా అని రాజకీయాలకు దూరం కాలేదు గత ఎన్నికల్లో తన భర్త నారా లోకేష్ తరఫున ప్రచారం చేస్తూనే గ్రౌండ్ వర్క్ చేశారు.

ఇదీ చదవండి: అన్‌స్టాప‌బుల్ 2 తాజా ప్రోమో వైరల్.. చిరంజీవి బాలకృష్ణ కాంబోలో సినిమా

Exit mobile version