Site icon Prime9

Viral Video: గుండ్రంగా తిరుగుతూ చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. వీడియో వైరల్

mystery-behind-sheep-walking-in-circle-in-china video goes viral

mystery-behind-sheep-walking-in-circle-in-china video goes viral

Viral Video: చైనాలోని ఓ గొర్రెలు మంద గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. గత 12 రోజులుగా అలుపు సొలుపు లేకుండా నిరంతరాయంగా తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్న వీడియోను చైనా అధికారిక మీడియా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇన్నర్ మంగోలియాకు చెందిన ఓ వ్యక్తి వందల సంఖ్యలో గొర్రెలు పెంచుతున్నాడు. కాగా ఈ నెల మొదటి వారంలో వాటి ప్రవర్తనలో మార్పు వచ్చింది. మందలోని గొర్రెలన్నీ ఒకచోట చేరి గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాయి.

నవంబరు 4న మొదలైన ఈ వింత ప్రవర్తన ఈ నెల 16న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు కొనసాగింది. అయితే, ఇప్పుడు కూడా అవి అలాగే ప్రవర్తిస్తున్నాయా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. అయితే, గొర్రెలు ఇలా వృత్తాకారంలో తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తుండడానికి లిస్టెరియోసిస్ బ్యాక్టీరియా కారణం కావచ్చని ఇది సోకితే ‘సర్క్‌లింగ్’వ్యాధి వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకిన గొర్రెలు 48 గంటల్లోనే మరణిస్తాయని అయితే, ఇవి మాత్రం వారాలు దాటుతున్నా ఆరోగ్యంగా ఉండడంతో దీనికి సోకింది ఆ వ్యాధి కాకపోవచ్చని కూడా అంటున్నారు.

ఇదీ చదవండి: ఇదేంది భయ్యా ఇది.. ఇది నేనేడా చూడలే.. 9 మంది పిల్ల‌ల‌తో సైకిల్ స‌వారీ

Exit mobile version