Site icon Prime9

Viral Video: ఘోరంగా కొట్టుకున్న కాలేజీ అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..?

fight-between-college-girls-in-a-college-on-gangapur-road-nashik-video-goes-viral

fight-between-college-girls-in-a-college-on-gangapur-road-nashik-video-goes-viral

Viral Video: ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న‌డిరోడ్డుపైనే జుట్టుజుట్టు పట్టుకుని పొట్టుపొట్టున కొట్టుకున్నారు. వారి స్నేహితులు ఇద్ద‌రిని విడ‌దీసేందుకు ప్ర‌య‌త్నించినా వారు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌ నాసిక్‌లోని గంగాపూర్ రోడ్డులోని ఓ కళాశాలలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే క్యాంటీన్‌లో సీట్ల విష‌య‌మై ఇద్ద‌రు విద్యార్థినుల మ‌ధ్య ప్రారంభమైన మాట‌ల యుద్ధం కాస్త చిలికి చిలికి గాలి వాన‌గా మారి కొట్లాట‌కు దారి తీసింది. దానితో అక్క‌డి క్యాంటీన్ సిబ్బందిని ఇద్ద‌రిని బ‌య‌ట‌కు పంపించివేశారు. బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా విద్యార్థినులు గొడ‌వ ఆప‌లేదు. ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దులతో జ‌ట్టు ప‌ట్టుకుని ఘోరంగా కొట్టుకున్నారు. వారి స్నేహితులు ఆ ఇద్దరు విద్యార్థినులను ఆపేందుకు య‌త్నించినా వారు ఏ మాత్రం ఆగలేదు. ఇంకొంద‌రు ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

ఇదీ చదవండి: ఇదేంది భయ్యా ఇది.. ఇది నేనేడా చూడలే.. 9 మంది పిల్ల‌ల‌తో సైకిల్ స‌వారీ

Exit mobile version