Site icon Prime9

Viral News: ఏడు నెలలుగా అపస్మారక స్థితిలో ఉన్న మహిళ.. పండండి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

coma patient gives birth to a healthy baby in delhi Aiims

coma patient gives birth to a healthy baby in delhi Aiims

Viral News: ఎయిమ్స్‌లో ఓ అద్భుత ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఏడు నెలలుగా కోమాలోనే ఉన్న ఓ మహిళ తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇలాంటి కేసు చూడటం తాను ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులే ఆశ్చర్యపోతున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ బులంద్‌శహర్‌కు చెందిన సఫీనా అనే మహిళ 40 రోజుల గర్భంతో ఉండగా ఓ ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడింది. మార్చి 31న సఫీనా తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయం అయ్యింది. దానితో సఫీనా కోమాలోకి వెళ్లిపోయింది. బులంద్‌షహర్‌లో ఆమెకు ప్రాథమికంగా చికిత్స అందించిన తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు వైద్యులు రిఫర్ చేశారు. ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని దిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. అయితే గత ఏడునెలలుగా ఆమె కోమాలోనే ఉండిపోయింది. తల్లి కోమాలో ఉండగా.. గర్భం మాత్రం రోజురోజుకూ అభివృద్ధి చెందుతూనే ఉందని, 18 వారాల తర్వాత అల్ట్రా సౌండ్ స్కాన్ చేయగా అందులో పిండం భద్రంగా ఉన్నట్టు తేలిందని వైద్యులు తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయానికే సఫీనా 40 రోజుల గర్భిణి అని ఆమె కోమాలోకి వెళ్లినా కడుపులోని శిశువు మాత్రం ఆరోగ్యంగా ఉందని.. తనకు అబార్షన్ చెయ్యాలా లేదా డెలివరీ చెయ్యాలా అనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలుపగా వారు అబార్షన్‌కు ఒప్పుకోలేదని వైద్యులు తెలిపారు. నెలలు నిండిన ఆమెకు ఇటీవల సాధారణ ప్రసవం చేయగా ఆరోగ్యవంతమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి అచేతన స్థితిలో ఉండడం వల్ల బిడ్డకు పాలు ఇవ్వలేదని.. ప్రస్తుతానికి డబ్బా పాలే అందిస్తున్నాం’’ అని వైద్యులు పేర్కొన్నారు. భర్త ఉద్యోగం మానేసి ఇంతకాలం ఆమె బాగోగులు చూసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి:పాము కాటేసిన బాలుడు సేఫ్.. బాలుడు కొరిన పాము మృతి

Exit mobile version