PM Modi:: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 జాతీయ రహదారులకు ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ -మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులను ప్రారంభించారు. మేడ్చల్, బొల్లారం, ఉందానగర్ కు ఎంఎంటీస్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. రిమోట్ ద్వారా శిలా ఫలకాలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఒకే రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాం. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చేశాం. తెలంగాణలె నాలుగు హైవేలకు శ్రీకారం చుట్టాం. హైదరాబాద్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కూడా అమల్లో ఉంది. పరిశ్రమలు, వ్యవసాయాభివృద్ధికి కేంద్రం చేయూత ఇస్తోంది. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే 7 మెగా టెక్స్ టైల్స్ పార్కులతో పాటు తెలంగాణలో కూడా మోగా టెక్స్ టెల్స్ పార్కు ఏర్పాుటు చేస్తున్నాం. కానీ, తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు. అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది.