Dwarampudi Chandrashekhar Reddy: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చేయమని.. కోరడం.. వైసీపీ ఎమ్మెల్యే లపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడడం.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తుంది. అలాగే కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ అక్కడి స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తాగిన మత్తులో డబ్బు పిచ్చితో స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు. కాగా ఈ వ్యాఖ్యలపై ద్వారంపూడి స్పందించారు. కాకినాడలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్ట్ టీడీపీ ఆఫీస్ నుంచి వస్తుందని ఆయన ఆరోపించారు. వారు ఇచ్చినట్లుగా వారాహి యాత్రలో చదువుతూ నాపై పవన్ లేనిపోనీ నిందలు వేస్తున్నారని కాకినాడ గురించి తెలుసుకుని మాట్లాడాలంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.
బెస్ట్ లివింగ్ సిటీ ఆఫ్ ఇండియాగా కాకినాడ నాలుగవ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. పండించిన పంటను మాకు ఇవ్వడానికి రైతులేమైనా అమాయకులా? ఇరవై ఏళ్ళుగా మా కుటుంబం రైస్ బిజినెస్‌లో లేదని, ఎగుమతులు మాత్రం చేస్తున్నామని ఆయన వివరించారు. కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతి అవుతున్న రైస్‌లో 90శాతం బయట రాష్ట్రాలు నుండి వస్తుందని ద్వారంపూడి అన్నారు.