Ap Hostel Girls : రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా లింగరాజుపాలెం కస్తుర్భా పాఠశాల విద్యార్థినుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరితో కన్నీరు పెట్టిస్తోంది. మంచిగా చదువు చెబుతారని ఇక్కడ చేరామని.. కానీ ఆ పరిస్థితి లేదంటూ బాలికలు కన్నీటి పర్యంతం అయ్యారు. మా తల్లిదండ్రులు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఎంతో కష్టపడి చదివిస్తున్నారు.. కానీ ఇక్కడ కనీసం చదువుకునే పరిస్థితి కూడా లేదంటూ ఏపీకి చెందిన ఓ కస్తూర్భా స్కూల్ విద్యార్థినులు కన్నీరు పెట్టుకుంటూ సమస్యలు వివరించారు. బెడ్ లు అడ్డుపెట్టుకొని ఆరు బయట స్నానం చేయాల్సి వస్తుందని వాపోయారు. ఈ చిన్నారుల కన్నీల్లను చూసయినా రెసిడెన్షియల్ కస్తూర్భా స్కూల్ సమస్యలను పరిష్కరించాలని అందరూ కోరుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/