KTR on Party Defections: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీని కలవటం పై ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఒకవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ను సవరిస్తామని మాట్లాడుతూ.. మరో వైపు అందుకు విరుద్ధంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని..(KTR on Party Defections)
రాహుల్ గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని, పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులు స్వతహాగా అనర్హులయ్యేలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరిస్తామని పెద్ద మాటలు చెబుతున్నారు. అదే రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. నెలల్లో అనర్హతలపై నిర్ణయం తీసుకోవాలనే సుప్రీంకోర్టు తీర్పును సైతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఉల్లంఘించారు. ఇది రాజ్యాంగ రక్షణా? లేక అపహాస్యమా ? మేము ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు దృష్టికి తీసుకువెళతాము అంటూ కేటీఆర్ ట్వీట్ చేసారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే భేటీ అయిన ఫొటోలను కేటీఆర్ షేర్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాహుల్ గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డితో కరచాలనం చేస్తున్నట్లు మరో ఫొటో ఉంది. మరో ఫోటోలో రాహుల్ గాంధీ రాజ్యాంగం యొక్క కాపీని చేతితో పట్టుకుని ఉన్నారు.
.