AP Assembly Elections 2024: తమ గ్రామానికి రోడ్డు లేదని కొందరు ,తమ పంటకు గిట్టుబాటు ధర లేదని కొందరు ,తమ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదని కొందరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే . మరోవైపు పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు సరైన దారిలేకపోయినా వాగులు వంకలు దాటుకుని ఓటు వేస్తున్నారు. మరికొందరు. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు.. బాధ్యత అని బాగా ప్రచారం జరిగిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేరకు బాగానే పనిచేస్తుంది .. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు కదలడం లేదు. సెలవును ఎంజాయ్ చేసే పనిలోనే ఉన్నారు.
కొండలు.. నదులు రాటుకుని..(AP Assembly Elections 2024)
కానీ, గ్రామాల్లో వున్నా కొంత మంది చదువు కోకపోయినా.. ఓటు విలువ తెలుసుకున్నారు . దీంతో ఎలాంటి ప్రయాణ సౌకర్యం లేకపోయినా.. కొండలు దాటుకుని.. నదులు దాటుకుని మరీ వచ్చి పోలింగ్ బూతుల ముందు నిలబడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నది దాటి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఓటర్లు.. ఓటు హక్కు కోసం బారులు తీరారు. కొమరాడ మండలంలో నాగావళి నది దాటి కూనేరు లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రెబ్బ గ్రామస్తులు.. తమ ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోయినా.. ఓటు వేసేందుకు పోటెత్తారు. వారితో పాటు నిండు గర్భిణి అయిన ఓ మహిళను ఓటు వేయడానికి డోలీలో తీసుకెళ్లారు. సుమారు 4 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటు వేశారు .