Site icon Prime9

Madanapalle: శోభనం గదిలోనే వరుడు మృతి

groom-died-of-heart-attack-in-bedroom

Annamayya District: అన్నమయ్య జిల్లాలో పెళ్లైన 24 గంటల్లోపే వరుడు మరణించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. శోభనం గదిలోనే వరుడు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన పై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నమయ్య జిల్లాలోని పాకాల మండలానికి చెందిన తులసీప్రసాద్ కు మదనపల్లికి చెందిన యువతితో సోమవారం నాడు వివాహం అయింది. వివాహం జరిగిన తర్వాత కొత్త జంటకు శోభనం ఏర్పాటు చేశారు. గదిలోకి ముందుగా వెళ్లిన తులసీ ప్రసాద్ బెడ్ పై నిర్జీవంగా పడిపోవడంతో నవ వధువు శిరీష ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేసింది. దీనితో వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు.

తులసీప్రసాద్ మరణానికి సంబంధించి కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version