Site icon Prime9

Chikoti Praveen: నన్ను చంపేస్తామని విదేశాలనుంచి ఫోన్లు.. చికోటి ప్రవీణ్

Chikoti Praveen

Chikoti Praveen: క్యాసినో కేసులో . ప్రధాని నిందితుడు చికోటి ప్రవీణ్‌ సంచలణ కామెంట్స్‌ చేశారు. తనను చంపేస్తానంటూ విదేశాల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని చెప్పాడు. హిట్ మెన్‌ అనే యాప్‌లో సుపారి ఇచ్చామని.. త్వరలోనే నీ ప్రాణాలు పోతాయంటూ కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని చెప్పారు. గుర్తి తెలియని కొందరు వ్యక్తులు తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించానరని చెప్పారు. కొందరు రాజకీయ నేతల పేర్లు చెప్పాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను బలి పశువును చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకు భద్రత కావాలంటూ ఇప్పటికే హైకోర్ట్‌లో తాను పిటిషన్‌ కూడా దాఖలు చేశానన్నారు.

క్యాసినో లీగల్‌గా ఉన్న ప్రాంతాల్లోనే తాను గేమ్స్‌ నిర్వహించానని చికోటి ప్రవీణ్‌ చెప్పారు. ఈడీ ఎప్పుడు విచారణకు పిలిచినా తాను హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఎలాంటి హవాలాకు పాల్పడలేదన్నారు. సినీ తారలకు ఇవ్వాల్సిన రెమ్మునరేషన్‌ కూడా నిబంధనల ప్రకారమే చెల్లించానన్నారు. తన జూలో జంతువులను ప్రభుత్వం నుంచి అనుమతి తిసుకున్నాకే పెంచుతున్నానని చెప్పారు. తన దగ్గర ఉన్న పురాతన వస్తువులు కేరళ మ్యూజియం నుంచి నిబంధనల ప్రకారమే కొన్నానని వివరించారు.

Exit mobile version