Site icon Prime9

Jr Ntr : బావమరిది మూవీని ప్రమోట్ చేసిన యంగ్ టైగర్.. “మ్యాడ్” మూవీ ట్రైలర్ రిలీజ్

Jr Ntr brother in law narne nithin mad movie trailer released

Jr Ntr brother in law narne nithin mad movie trailer released

Jr Ntr : యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సతీమణి తమ్ముడు నార్నే నితిన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ లతో కలిసి నటిస్తున్న చిత్రం “మ్యాడ్”. కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర హారిక నిర్మాతగా పరిచయమవుతున్నారు. సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో ఫార్చునర్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల టీజర్ లాంచ్ చేసి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది మూవీ యూనిట్.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr ) చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ట్రైలర్ ను చూసిన తారక్ టీమ్ ను అభినందించారు. ఫన్ ఫుల్ రైడ్ గా సాగడంతో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ట్రైలర్‌ ని గమనిస్తే..  సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ అనే ముగ్గురు స్నేహితుల జీవితాల గురించి చెప్పారు. వాళ్ల కాలేజీ డేస్ ని చూపిస్తూ ఫన్ ఫుల్ రైడ్ గా సాగినట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు.

 

 

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ‘మ్యాడ్ ‘ మూవీలో హీరోగా నటిస్తుడటంతో ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా దక్కుతోంది. యువతను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.  భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కాలేజీ బ్యాగ్రాఫ్ లో వచ్చిన సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.  ‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారు లోకం’, ‘సై’ సహా పలు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమా కూడా యూత్ ను ఓ రేంజిలో ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version