Jana Sena Landslide Victory:ఏపీ అసెంబ్టీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ దుమ్మురేపింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు కూడా జనసేన ఈ స్దాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఊహించలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓర్పు, సహనం, వ్యూహం ఇవన్నీ కలిపి ఈ రోజు ఏపీ అసెంబ్లీలో జనసేన రెందవ అతిపెద్ద పార్టీగా అవతరించడానికి దోహదం చేసాయి.
భారత్ దేశంలో ఇప్పటి వరుకు ఏ పార్టీ కూడా పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలుపొందలేదు .జనసేన చరిత్ర సృష్టించింది . దీనికి పరోక్షంగా వైసీపీ నాయకులు కూడా కారణం అని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన ఒక్క రాజోలు సీటను మాత్రం దక్కించుకుంది. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక రెండు చోట్ల ఓడిపోయారు. దీనితో వైసీపీ నేతలు జనసన అధినేతను పెద్ద ఎత్తున హేళన చేయడం ప్రారంభించారు. అంతేకాదు పవన్ వ్యక్తిగత జీవితంపైన అవాకులు, చవాకులు మాట్లాడటం ప్రా్రంభించారు పవన్ కళ్యాణ్ ను ఎంతగానో రెచ్చగొట్టారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల రిలీజ్ రోజున ఆంక్షలు పెట్టడం, అభిమానులను ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. దీనితో వైసీపీని అధికారంలోనుంచి దించాలని పవన్ నిర్ణయించారు. దీనికోసం తాను ఒక మెట్టు దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టినపుడు వెళ్లి పరామర్శించి తాను టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించారు. జగన్ను గద్దె దించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. తరువాత ఎన్నికలు స్వేచ్చగా జరగాలంటే కేంద్రం సహకారం అవసరమని గుర్తించిన పవన్ బీజేపీ కేంద్రనాయకులతో మాట్లాడి వారిని టీడీపీతో పొత్తుకు ఒప్పించారు. పార్టీల మధ్య సీట్ల ఒప్పందంలో భాగంగా జనసేనకు ఎ క్కువగా అడగాలని పార్టీ నాయకులు డిమాండ్ చేసినప్పటికీ వాస్తవ పరిస్దితులను వారికి వివరించి 21 సీట్లుకే సర్దుకు పోయారు. జగన్ గద్దె దించడమే టార్టె ట్ గా పనిచేయాలని, అధికారం, పదవులు తనకు వదిలేయాలని పార్టీ క్యాడర్ కు సూచించారు. పవన్ త్యాగం వృధా కాలేదు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకుని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. టీడీపీ, బీజేపీ అభ్యర్దులు పోటీ చేసిన చోట జనసైనికులు శక్తివంచలేకుండా తమ వంతు సాయం చేసారు. మొత్తంమీద ఎన్డీఏ కూటమి బ్లాక్ బస్టర్ గెలుపులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్క్ష్ తన వంతు పాత్రను పోషించారు.