Ycp Leaders Phone Tapping : అధికార పార్టీ వైసీపీలో సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ గురించి సొంత పార్టీ నేతలే చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.
తమ ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
కాగా కోటం రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అవాస్తవం అని ఆయన అన్నారు.
టీడీపీలోకి పోవాలనుకునే వాళ్లే ఇలాంటివి చెబుతారని ఎదురుదాడికి దిగారు.
వైసీపీకి నష్టం చేసి టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారని బాలినేని ఫైర్ అయ్యారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారు.
ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లే వారు వెళ్లకుండా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం ఏంటి? ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు.
శ్రీధర్ రెడ్డిని బతిమిలాడం. పార్టీని వీడినందుకు ఆయన బాధపడక తప్పదు.
శ్రీధర్ రెడ్డి స్థానంలో కొత్త ఇంచార్జ్ ను పెడతాం అని బాలినేని అన్నారు.
కోటంరెడ్డితో మాట్లాడిన వ్యక్తే కాల్ రికార్డ్ చేశాడు. కాల్ రికార్డును ఫోన్ ట్యాపింగ్ అంటారా? అని బాలినేని ప్రశ్నించారు.
కోటంరెడ్డి స్నేహితుడే కాల్ రికార్డు చేసి లీక్ చేశాడని బాలినేని ఆరోపించారు.
కోటంరెడ్డి సోదరుల మధ్య తాము ఎలాంటి చిచ్చు పెట్టలేదని, ఆ అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరు రూరల్ ఇంచార్జి పదవి తనకు ఇవ్వాలని కోటంరెడ్డి సోదరుడు కోరాడని, అయితే కోటంరెడ్డితో ఆ విషయం మాట్లాడుకోవాలని సూచించామని బాలినేని స్పష్టం చేశారు.
మంత్రి పదవి జిల్లాకు ఒకరికే దక్కుతుందని, ఐదారుసార్లు గెలిచిన వాళ్లకు కూడా మంత్రి పదవి దక్కని సందర్భాలు ఉన్నాయని బాలినేని వెల్లడించారు.
పదవులు దక్కకుంటే పార్టీపై నిందలు వేస్తారా? అని అన్నారు.
కాగా అంతకు ముందు వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
తన అనుచరులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో లీకైంది.
గత కొంత కాలంగా వైసీపీ నాయకత్వంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు.
తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి చెప్పారు. ప్రజల కోసమే తాను పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా చెప్పారు.
వైసీపీలో అవమానాలు భరించలేనన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయన్నారు.
ఈ ఆధారాలను బయటపెడితే ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయన్నారు. తన మాటలను విశ్వసించాలని ఆయన కోరారు.
బాలినేని వ్యాఖ్యలకు కోటంరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు రేపు నిరూపిస్తానని స్పష్టం చేశారు.
సాక్ష్యాలతో మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ బయటపడితే ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయని అన్నారు.
వారి ఉద్యోగాలు పోతాయనే ఇప్పటివరకు బయటపెట్టలేదని కోటంరెడ్డి వివరించారు.
ఇప్పుడు సాక్ష్యాలు బయటపెట్టక తప్పడంలేదని అన్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/