Vinaro Bhagyamu Vishnu Katha Movie : రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో “కిరణ్ అబ్బవరం”.
మంచి యూత్ ఫుల్ సినిమాలతో యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఈ నటుడు.. ఈసారి ఒక కొత్త కాన్సెప్ట్ రాబోతున్నాడు.
గత ఏడాది మూడో సినిమాలతో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ హీరో.. ఈ సంవత్సరం మొదటిలోనే మరో మూవీని ప్రేక్షకుల ముందు తీసుకువస్తున్నాడు.
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యం విష్ణు కథ’.
ఈ సినిమాలో హీరోయిన్ గా కాశ్మీర నటిస్తుంది. తమిళ సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగులో ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.
మురళి శర్మ, శుభలేఖ సుధాకర్, ప్రవీణ్, పమ్మి సాయి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
కొత్త దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
మొదటిసారి ఏ యంగ్ హీరో గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలో నటిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న కిరణ్ అబ్బవరం (Vinaro Bhagyamu Vishnu Katha Movie)..
కాగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ట్రైలర్ ని లాంచ్ చేశాడు.
ట్రైలర్ ని బట్టి చూస్తే ఫోన్ నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ వస్తున్నట్లు తెలుస్తుంది.
మన ఫోన్ నెంబర్ లో లాస్ట్ డిజిట్ కి అటు పక్క ఒక నెంబర్, ఇటు పక్క ఒక నెంబర్ ఉంటుంది కదా. అలా హీరోయిన్ తన నెంబర్ కి ఉన్న నైబర్ నంబర్స్ ని కాంటాక్ట్ అవుతుంది.
అందులో ఒక నెంబర్ హీరో కిరణ్ అబ్బవరంది, మరో నెంబర్ మురళీశర్మది. ఈ ముగ్గురు మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు ఆడియన్స్ ని అలరించేలా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక హీరోయిన్ లాగానే, హీరో నెంబర్ కి కూడా నైబర్ నంబర్స్ ఉంటాయి కదా.
వాటిలో ఒక నెంబర్ హీరోయిన్‌ది అయితే, మరో నెంబర్ విలన్‌ది. ఇలా నైబర్ నంబర్స్ ని కాంటాక్ట్ అవ్వడం వల్ల హీరో, హీరోయిన్ అనుకోని ప్రమాదంలో పడతారు.
దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అనేదే మిగిలిన కథ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయ్యిన ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్ వరకు సినిమా పై అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.
సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఇప్పటి వరకు ఎక్కువ ప్రేమ కథలతో ఆడియన్స్ ని అలరించిన ఈ యువ హీరో.. ఈసారి లవ్, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ ని కలిపి ఆడియన్స్ ని కలిపి చేస్తుండడంతో ఆడియన్స్ ని ఏ మేర అలరిస్తాడో చూడాలి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/